Monday, December 23, 2024

కాంగ్రెస్ ఎలెక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇచ్చేస్తారా?: పడ్నవీస్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎలెక్టోరల్ బాండ్ల స్కీమ్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీజేపీని లక్షంగా చేసుకుని తీవ్రంగా విమర్శించడాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తిప్పికొట్టారు. ఆయన పార్టీ అందుకున్న ఎలెక్టోరల్ బాండ్లను తిరిగి రాహుల్ ఇచ్చేస్తారా? అని ఎదురు ప్రశ్న వేశారు. భారత్ జోడో న్యాయయాత్ర శనివారం ముంబైలో ముగియనున్న సందర్భంగా రాహుల్ బీజేపీ ఎలెక్టోరల్ బాండ్లపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వాలను పడగొట్టడానికి, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి, బీజేపీ ఈ ఎలెక్టోరల్ బాండ్ల రాకెట్‌ను ఉపయోగించిందని రాహుల్ ఆరోపించారు.

దీనిపై ఫడ్నవీస్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయిన తరువాత విలేఖరులతో మాట్లాడారు. 303 ఎంపీలతో బీజేపీ పెద్ద పార్టీ అయినందున మొత్తం బాండ్లలో 30 శాతం తాము పొందగలిగామని, మిగతా బాండ్లు కాంగ్రెస్‌తో సహా విపక్షాలు 70 శాతం పొందగలిగాయని వివరించారు. అందుకని రాహుల్ తమ పార్టీకి వచ్చిన ఎన్నికల బాండ్ల నిధులు తిరిగి ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు.

ఎలెక్టోరల్ బాండ్లు పద్ధతి ప్రకారం జమ అవుతుంటాయని, దాన్ని బ్యాలెన్స్ షీట్‌లో పార్టీలు చూపిస్తాయని, ఈ స్కీమ్‌లో ఏవైనా లోపాలుంటే కోర్టు తేల్చి చెబుతుందని పేర్కొన్నారు.ఎన్నికల నిధుల కోసం కాంగ్రెస్‌కు బ్లాక్‌మనీ అవసరమని , అది స్తంభించడంతో రాహుల్ ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. ఈ విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాహుల్‌కు మాట్లాడడానికి మరే విషయం లేదని, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు రాహుల్‌కు లేదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News