Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి సవాల్ కు సిద్ధమేనన్న కెటిఆర్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వీకరించారు. మూసీ పక్కన మూడు నెలలు ఉండేందుకు తాను సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి చేస్తోంది బ్యూటిఫికేషన్ కాదు…లూటీఫికేషన్ అన్నారు.

నాగోల్ లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని మాజీ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్ సిలతో కలిసి కెటిఆర్ పరిశీలించారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కెసిఆర్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లేనని కెటిఆర్ అన్నారు. మూసీ పక్కన మూడు నెలల పాటు ఉండాలన్న రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించడానికి తాను సిద్ధమేనన్నారు.  దమ్ముంటే మూసీ నది లోతు పెంచి కోల్ కతా వంటి నగరాన్ని నిర్మించాలన్నారు. మూసీ బాధితులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తుందని కూడా కెటిఆర్ హామీ ఇచ్చారు. ఇక ఎవరు మాట మీద నిలబడతారో?…

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News