Saturday, December 21, 2024

టిడిపికి, ఎంపి పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని.. ఈ సమయంలో తాను ఇంకా టిడిపిలో కొనసాగడం కరెక్ట్ కాదని నాని చెప్పారు. తన ఎంపి పదవికి కూడా రాజీనామా చేస్తానని.. త్వరలో లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించి, ఆ తర్వాత టిడిపి పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును వేరే వ్యక్తికి ఇస్తామంటూ నానికి తెలుగుదేశం అధిష్ఠానం వర్తమానం పంపించింది. దీనిపై నాని శుక్రవారం నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ‘నేను వద్దని చంద్రబాబు అనుకున్నారు. నేను అలా అనుకోలేదు. విజయవాడ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాను. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ది చేశాను. అలాంటి నేను ఖాళీగా ఉంటే అభిమానులు ఊరుకుంటారా?” అని ఎదురు ప్రశ్నించారు.

ఏదిఏమైనా మూడోసారి విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధించడం ఖాయమని కేశినేని నాని అన్నారు. ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకో ప్లైట్ చూసుకోవాలి కదా? అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. 2024 మే వరకూ తానే ఎంపీనని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని నాని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News