Tuesday, September 17, 2024

ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని పునరుద్ధరిస్తా

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారతదేశంలోని స్వేచ్ఛను, మత సామరస్యాన్ని తాను పూర్తిగా అనుభవిస్తున్నానని, ప్రాచీన భారత విజ్ఞానాన్ని పునరుద్ధరించడానికి తాను కట్టుబడి ఉన్నానని టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలై లామా అన్నారు. తన 86వ జన్మదినం సందర్భంగా మంగళవారం దలై లామా ఇక్కడి తన నివాసం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రపంచ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియచేస్తూ మానవ సేవను తన తుది శ్వాస వరకు కొనసాగిస్తానని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడతానని తెలిపారు. శరణార్థిగా మారిన తాను భారతదేశంలో స్థిరపడి ఇక్కడి స్వేచ్ఛను, మత సామరస్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నానని దలై లామా అన్నారు. మతంతో సంబంధం లేకుండా ధర్మం, కరుణ, అహింస వంటి లౌకిక విలువలు పాటిస్తున్న భారతీయ సిద్ధాంతాన్ని తాను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజలంతా అహింసా సిద్ధాంతాన్ని పాటించి ఒకరితో మరొకరు ప్రేమపూర్వకంగా మెలగాలని ఆయన తన జన్మదినం సందర్భంగా పిలుపునిచ్చారు.

Will reviving ancient Indian knowledge: Dalai lama

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News