ముంబై: మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన ధారవి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టెండర్‌ను రద్దు చేస్తామని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్రే శనివారం తెలిపారు. విలేకరుల సమావేశంలో థాకరే మాట్లాడుతూ, ధారవి నివాసితులు, వ్యాపారాలు దెబ్బతినకుండా తమ పార్టీ కాపాడుతుందని, అక్కడ నివసించే ప్రజలకు 500 చదరపు అడుగుల ఇళ్లు ఇస్తుందని అన్నారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ధారవి స్లమ్ రీడెవలప్‌మెంట్ టెండర్‌ను రద్దు చేస్తాం… అదేదో ఇప్పుడే ఎందుకు రద్దు చేయకూడదో ప్రభుత్వం చెప్పాలి. ఎట్టి పరిస్థితిలోనూ ముంబైని ‘అదానీ నగరం’గా మార్చేందుకు అనుమతించబోమని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు.
ప్రతి ఇంటికి ఒక నంబర్ ఇస్తున్నారు, ప్రభుత్వం ధారవి నివాసితులను అర్హహులు, అనర్హుల ఉచ్చులో పడేయాలని చూస్తోంది, ఆపై వారిని తరిమికొట్టాలనుకుంటోందని థాకరే అన్నారు. వేలం తర్వాత నవంబర్ 2022లో అదానీ ప్రాపర్టీస్‌కు టెండర్‌ను కేటాయించారు, ఇందులో రియల్టీ మేజర్ డిఎల్ఎఫ్ , నమన్ డెవలపర్లు కూడా పాల్గొన్నారు.