Friday, December 20, 2024

నైతికత ఉంటే షిండే రాజీనామా చేస్తారు: ఉద్ధవ్ థాకరే

- Advertisement -
- Advertisement -

ముంబై: తాను అప్పట్లో నైతిక బాధ్యత అనుకుని, ఇప్పుడు సుప్రీంకోర్టు చెపుతున్నట్లు తొందరపడి పదవికి రాజీనామా చేశానని, అయితే ఇప్పుడు సిఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేస్తారా? అని మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ షిండేల వ్యవహారంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించిన దశలో ఉద్ధవ్ తమ నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

షిండే నియామక ప్రక్రియలో గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ముందుగానే రాజీనామా చేయడంతో ఉద్ధవ్‌ను తిరిగి సిఎం చేయడం కుదరదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఉద్ధవ్ స్పందిస్తూ రాజకీయాల్లో కానీ, ఉన్నత పదవుల్లో ఉన్న వారికి కానీ నైతికత గీటురాయి వంటిది. దీనిని తాను విశ్వసిస్తానని, కోర్టు తీర్పు తన వైఖరిని సమర్థించే నైతిక బలం అందించిందని తెలిపిన ఉద్ధవ్.. ఇక షిండే నిర్ణయాన్ని ఆయన నైతికతకే వదిలిపెడుతున్నట్లు తెలిపారు.

షిండే ప్రభుత్వం అక్రమం.. నా వాదన నిజమైంది: ఆదిత్యా థాకరే
ఏక్‌నాథ్ ప్రభుత్వ ఏర్పాటు అక్రమం రాజ్యాంగ వ్యతిరేకం అనే తన వాదన సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని శివసేన (యుబిటి) నేత, మాజీ మంత్రి ఆదిత్యా థాకరే తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు సరైన పద్ధతిలో జరగలేదని సుప్రీంకోర్టు ఇప్పుడు తెలిపింది. దీనితోనే ఇక్కడి ఇప్పటి సర్కారు అధికారంలో ఉండే హక్కు నైతికంగా కోల్పోయినట్లే అయింది. ఈ ప్రభుత్వం మనుగడ చట్టవిరుద్ధం అని తాను చాలా కాలంగా చెపుతున్నానని ఇది నిర్థారణ అయిందని ఆదిత్యా వ్యాఖ్యానించారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఉంది. వీరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు సరికాదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News