మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో మార్గదర్శిని మూసేస్తామని ఎపి సిఐడి అడిషినల్ డిజిపి సంజయ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎపిలోనే అతిపె ద్ద చిట్‌ఫండ్ స్కాంను నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి సంస్థకు ఉందని పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడంతో సహా పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తరలిస్తున్నారని, ప్రజలకు వడ్డీ ఇస్తామనే ఆశ చూపి చందాదారుల డబ్బు ను మార్గదర్శి తన వద్దే ఉంచుకుంటోందని, చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఖాతాలను నిర్వహిం చడంతో పాటు, బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయలేదని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై మార్చి 10న దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఇప్పటి వరకు 7 ఎఫ్‌ఐ ఆర్‌లు నమోదు చేశామని, ఇప్పటి వరకు నలుగురు ఫోర్‌మెన్‌లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సమాచారంతో ఆడిటింగ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజాకిరణ్ ఉన్నారని, నాలుగు రాష్ట్రాల్లో 108 మార్గదర్శి బ్రాంచ్‌లు నడుస్తు న్నాయని తెలిపారు. ఎపిలో 37 బ్రాంచ్‌లు, 2351 చిట్ గ్రూప్స్ ఉన్నాయన్నారు. రెండు జీవోల ద్వారా రూ.1,035 కోట్లు అటాచ్ చేసినట్లు వెల్లడించారు. అటాచ్‌మెంట్‌లో ఆస్తులు, మ్యూచ్‌వల్ ఫండ్స్ ఉన్నాయని తెలిపారు. కంపెనీ మూత పడితే ఖాతాదారులకు చెల్లించాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు ఉంటుందని, అందుకే ఎపి సిఐడి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి ఉందని వెల్లడించారు. మార్గదర్శి కేసులో A1 రామోజీరావు, A2 శైలజా కిరణ్ ఏ3. ఏ4గా మార్గదర్శి ఫోర్మెన్, ఏ5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె.శ్రవణ్‌కుమార్ నిందితులుగా చేర్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను విచారించినా, వారు దర్యాప్తుకు సహకరించట్లేదన్నారు. వేల కోట్ల రుపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెక్కలు చూస్తే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన సమాచారంతో అడిటింగ్ చేశామన్నారు. 108 బ్రాంచ్‌లతో నాలుగు రాష్ట్రాల్లో కార్యకలపాలు సాగిస్తోందని పేర్కొన్నారు.
రూ. 604 కోట్ల విలువైన 23 గ్రూప్ ల నిలిపివేత !?
మార్గదర్శి చిట్స్ కు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో భారీగా ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మంగళవారం మరిన్ని చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్స్ కు చెందిన 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా గ్రూపుల్లో లావాదేవీలకు అవకాశం లేకుండా చేశారు. అలాగే త్వరలో మార్గదర్శి చిట్స్ పై కేంద్ర సంస్ధలతో దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నిస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో మంగళవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి టర్నోవర్ రూ.604 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు వ్యవహారంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అనంతపురం, అరండల్ పేట, నరసరావుపేట, విశాఖ, తణుకు, రాజమండ్రి బ్రాంచ్ ల పరిధిలో ఈ గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో అతిపెద్ద చిట్ ఫండ్ స్కాం ను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఈ స్కాంపై దర్యాప్తు చేయమని కోరినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతున్నందునే రిజిస్ట్రేషన్ల శాఖ ఇవాళ చిట్ గ్రూపు లను నిలిపేసినట్లు సమాచారం. మార్గదర్శి అక్రమాలపై ఇప్పటివరకూ జరిగిన తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఇందులో మనీలాండరింగ్, కార్పోరేట్ మోసాలు కూడా జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. వాటి ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సిబిఐ, ఇడిలను దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే సిఐడి విజ్ఞప్తిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.