Wednesday, January 22, 2025

రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి…డిసెంబర్ 7వ తేదీ నుంచే గాంధీభవన్ వద్ద పడుకుంటా!

- Advertisement -
- Advertisement -
బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అద్భుతంగా పుంజుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

బండ్ల గణేష్ గురువారం సాయంత్రం గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మీరు కూడా వస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ తాను 7వ తేదీ నుంచి ఇక్కడే పడుకుంటానని, మీరంతా 9వ తేదీన రావాలని సెటైరికల్ గా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News