Sunday, January 19, 2025

తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా: దిగ్విజయ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పారీలోనే ఉంటానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్వజయ సింగ్ స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించిన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ తనను లక్షంగా చేసుకున్నాయని సోమవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు.

తనతో సహా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నాయకులపై బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నకిలీ వీడియోలు, నకిలీ లేఖలు సృష్టించడం, తమ ప్రకటనలను వక్రీకరించడం వాటికి అలవాటేనని ఆయన విమర్శించారు.

తాను 1971లో కాంగ్రెస్‌లో చేరానని, తన తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆయన ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం బయటకు వచ్చిన లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News