Saturday, November 23, 2024

సిద్ధు పంజాబ్ సిఎం కాకుండా అడ్డుకుంటా!

- Advertisement -
Amarinder Singh

- Advertisement -

రాహుల్, ప్రియాంక నాకు పిల్లలాంటివారు: కెప్టెన్ అమరీందర్

చండీగఢ్: నవజోత్ సిద్ధు పంజాబ్ ముఖ్యమంత్రి కాకుండా తన శాయాశక్తుల అడ్డుకుంటానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం తెలిపారు. ఈ ప్రమాదకర వ్యక్తి నుంచి దేశాన్ని రక్షించేందుకు తాను ఎంతటి త్యాగానికైనా వెనుకాడనని అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధుకు వ్యతిరేకంగా గట్టి ప్రత్యర్ధిని నిలబెడతానన్నారు. “సిద్ధు రాష్ట్రానికి ప్రమాదకర మనిషి” అని వ్యాఖ్యానించారు.
“సిద్ధు కనుక ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేయదు. ఆ డ్రామా మాస్టర్ నాయకత్వంలో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెల సీట్లు కూడా గెలవడం కష్టం కాగలదు” అన్నారు.
“నేను మూడు వారాల క్రిందటే సోనియా గాంధీకి రాజీనామా సమర్పించాను, అప్పుడామె నన్ను పదవిలో కొనసాగమని కోరింది, ఒకవేళ ఆమె నన్ను దిగిపొమ్మని కోరినా నేను పదవ నుంచి దిగిపోయేవాడిని, ఓ సైనికుడిగా నా పని ఎలా నిర్వర్తించాలో నాకు బాగా తెలుసు” అన్నారు.
“సోనియా గాంధీ పిల్లలు ప్రియాంక, రాహుల్ నాకూ పిల్లల వంటివారే. కథ ఇలా ముగియాల్సింది కాదు. జరిగినదానికి నేను విచారిస్తున్నాను. ప్రియాంక, రాహుల్ అనుభవం లేనివారు. వారిని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పటికీ నేను రాజకీయ ఐచ్ఛికాన్ని తెరచే ఉంచుతున్నాను. మీరు 40 ఏళ్లలో ముసలివారిలా కావొచ్చు, 80 ఏళ్లలో యువకులలా ఉండొచ్చు” అన్నారు. తనకు వయస్సు అనేది అడ్డంకి కాదని ఆయన చెప్పకనే చెప్పారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ శాసనసభకు ఏడుసార్లు, పార్లమెంటుకు రెండుసార్లు ఎన్నికయ్యారు. “ఇప్పుడు నాకంతా సరిగానే ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వం పంజాబ్‌లో మార్పు తేవాలనుకుంటోంది. అందుకు చర్యలు తీసుకుంటోంది” అని అమరీందర్ వివరించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News