Sunday, September 8, 2024

బాధిత మహిళకు అండగా ఉంటా : మంత్రి

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : యువతిపై అసభ్యంగా ప్రవర్తించి నడి రో డ్డులో వివస్త్రను చేసిన నిందితులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బాధితురాలిని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్ష ణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, మద్యం మత్తులో దుర్మార్గుడు ఈవిధంగా పాల్పడటం బాధాకరమన్నారు.

నిందితుడితో పాటు అతని తల్లిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలికి జవహర్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించడమే కాకుండా డబుల్ బెడురూం ఇంటిని కేటాయించి ఆ ర్థికంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉద్యో గం చేయడానికి నిరాకరిస్తే మల్లారెడ్డి కాలేజీలో ఉద్యోగం కల్పిస్తానని హామి ఇచ్చారు.

ప్రభుత్వ పరంగా పూర్తిగా అండగా ఉంటానని, తన కూతురు మా దిరిగా చూసుకుంటానని మంత్రి తెలిపారు. అనంతరం యువతిని అల్వాల్‌లోని సఖీ సెంటర్‌కు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేట ర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News