Friday, December 20, 2024

రెండు మూడు రోజుల్లో ఒడిశా సిఎంపై నిర్ణయం: బీజేపీ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశాకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరవుతారు? అన్న ఊహాగానాలు సాగుతుండగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ బుధవారం వెల్లడించారు. విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాల ర్యాలీ సందర్భంగా బెర్హంపూర్‌లో ప్రధాని మోడీ కొత్త బీజేపీ ముఖ్యమంత్రి జూన్ 10 న ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఆలోచనల ప్రకారం ఒడియా సంస్కృతిసంప్రదాయాలకు విలువనిచ్చే నేతయే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ప్రజలు బీజేపీ హామీలను విశ్వసించారని, కొత్త ప్రభుత్వం వాటి అమలుకు తప్పనిసరిగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఒడిశాలో విజయంపై బీజేపీ మొదటి నుంచి నమ్మకంతో ఉందని, బిజూ జనతా దళ్ ప్రభుత్వం అవినీతిమయం కావడంతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. బీజేడీ ప్రభుత్వం అమలు చేస్తున్న బిజూ స్వస్త కల్యాణ్ యోజన (బిఎస్‌కెవై) పథకానికి బదులు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కేర్ స్కీమ్‌ను అమలు చేయడమే కొత్త ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా వివరించారు. బిఎస్‌కెవై పరిధి తక్కువైనందున దానికి బదులు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడమౌతుందని, దీనివల్ల ఒడిశా రాష్ట్రం అవతల నివసిస్తున్న 1.5 కోట్ల మందికి కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News