Saturday, November 23, 2024

అధికారంలోకి వస్తే…బజరంగ్‌దళ్‌పై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాం: చిదంబరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రగులుతున్న ‘బజరంగ్ దళ్ ’ గొడవల మధ్య కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం తమ పార్టీ కర్నాటక మేనిఫెస్టోలో దానిని నిషేధిస్తామని పేర్కొనలేదని, అయితే చట్టప్రకారం ‘నిర్ణయాత్మక చర్యలు’ తీసుకుంటామనే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇది విద్వేషప్రచారానికి పూనుకునే అన్ని సంస్థలకు ఓ హెచ్చరిక అన్నారు.

పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చిదంబరం, కర్నాటక రాష్ట్ర ప్రజలు తెలివిగానే ఎన్నుకుంటారనే విశ్వాసాన్ని ప్రకటించారు. ‘ప్రజాస్వామ్యాన్ని, కర్నాటక భవిష్యత్తును పరిరక్షించడానికి మనం కర్నాటకలో బిజెపి గెలవకుండా చూడాలి. ఈ విజయంతో పొరుగు రాష్ట్రాలలో కూడా విజయాన్ని సాధించాలి’ అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్(యుసిస), నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సి)ని కర్నాటకలో అమలు చేస్తామని బిజెపి అన్నదానిపై స్పందిస్తూ సమాజాన్ని చీల్చడానికి, సామాజిక ఉద్రిక్తతలను పెంచడానికి ఆ రెండు విషయాలు తోడ్పడతాయన్నారు. కర్నాటక ప్రజలు బిజెపి ఈ ఎన్నికల ప్రతిపాదనలను తిరస్కరిస్తారు అన్నారు.

కర్నాటకలో కోరుకున్న మార్పు రాగలదన్న ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. బజరంగ్ దళ్, పిఎఫ్‌ఐ లేక విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇతర సంస్థలపై నిర్ణయాత్మక చర్యలు చేపడతామన్నారు. బిజెపి, మీడియాలోని ఓ వర్గం నిరాశకు గురికాగలవన్నారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం శుష్క వాగ్దానం విషయంలో కర్నాటక ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News