Thursday, January 23, 2025

మా కన్నీరుతో జిల్లాను సస్యశామలం చేస్తారా?

- Advertisement -
- Advertisement -

మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతమ్మసాగర్ ప్రాజెక్ట్‌పై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. దీనికి సంభందించిన వివరాల ప్రకారం… ప్రభుత్వం రైతులు సాగు, త్రాగు నీరు అందించాలనే లక్షంతో అశ్వాపురం మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బ్యారేజి నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవంటూ కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయగా, ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతంలోని ప్రజల అభిప్రాయ సేకరణ జరిపిన తరువాత నిర్మాణ పనులు చేపట్టాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం అశ్వాపురం పట్టణంలోని ఎస్‌కెటి పంక్షన్ హల్ నందు జాతీయ కాలుష్యమండలి ఆద్వర్యంలో జెసి కర్నాటి వెంకటేశ్వర్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు పూర్తి స్ధాయిలో సమాచారం అందించలేదని, రైతులు పాల్గొనాల్సిన సమావేశంలో కేవలం అధికార ప్రతినిధులు పాల్గొని ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో పాల్గొ న్న కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐదు మండలాల్లో సుమారు వేల ఎకరాలు భూములు కోల్పోయి తాము నిర్వాసితులగా మారామని, ప్రభుత్వం కటితుడుపుగా వ్యవహరించి ఎకరాకి రూ.ఎనిమిది లక్షల పరిహారం ఇస్తామనడం విడ్డూరంగా ఉందని మం డిపడ్డారు. తామ కన్నీరుతో జిల్లాలను సస్యశ్యామలం చేస్తారా అని ప్రశ్నించారు. ఏజన్సీ చట్టాల పేరుతో తమను భయబ్రాంతులకు గురిచేస్తూ తమ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే ఉమ్మడి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు రూ.30లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ప్రభావిత రైతులకు రూ.8 లక్షల పరిహారం ఇవ్వడం దారుణమన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్ట్‌కు అనుసందానంగా నిర్మిస్తున్న హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లో నిర్వాసిత రైతుల పిల్లలకు ఉద్యోగ అవకాశం కలిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News