Tuesday, November 5, 2024

ధృవ పత్రాలు అందేనా..?

- Advertisement -
- Advertisement -

ధృవ పత్రాలు అందేనా..?
ఎల్బీనగర్: బిసి కార్పొరేషన్ ద్వారా ఎలాంటి పూచికత్తు లేని రూ.లక్ష ఆర్థిక సహాయం పొందాలనుకునే అర్హులంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మంగళవారం గడువు ముగియనుండటంతో వారు తహీశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఆశావహులు దరఖాస్తుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం ఆశావహులు వరుస కట్టారు. బిసీ సామాజిక వర్గాల్లోని 15 కులవృత్తుల వాళ్లే దరఖాస్తు చేసుకోవాలని ప్ర భుత్వం నిర్దేశించి నా, ఇతరులు సైతం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. మీ సేవాలో దరఖాస్తు చేసుకుంటున్నా ధృవపత్రం ఎప్ప డు చేతికందుతుందో తెలియక రెవిన్యూ కార్యాలయం మెట్లుక్కుతున్నారు. కొంత మందితై ఉద యం నుంచి సా యంత్రం వరకు పడిగాపులు కాచారు. సరూర్‌నగర్ మండలం తహీశీల్దార్ కార్యాలయం లోపల అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు.

తాము 7 వ తేదిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటే జారీ చేయకుండా 17,19 తేదీల లో దరఖాస్తు చేసుకుంటే వారికి ఎలా జారీ చేశారంటూ మండిపడ్డారు. ఇక్కడి రెవెన్యూ సిబ్బంది ఒక్కొక్కరి నుం చి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలకు రూ. 1000, 2000ల దాకా తీసుకొని పత్రాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఉన్న ఆపరేటర్లు వారికి ఇష్టమైన వారి ధృవ పత్రాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మీ సేవా సర్వర్‌తో పాటు రెవిన్యూ సర్వర్ మొరాయించడంతో ఆర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. సరూర్‌నగర్‌లో సుమారుగా 100 నుంచి 150 దాకా మీ సేవా, త హీశీల్దార్ కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నారు.

సరూర్‌నగర్ పట్టణ కార్యాలయంలో వద్ద గత మూడు, నాలుగు రోజులుగా జనజాతర సాగుతోంది. పట్టణ తహీశీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు ఏ ఓక్కటి కూడ జరగదు. ఇతర పనుల మీద ఇక్కడికి వచ్చే వారికి లోపలికి ప్రవేశించడం గగనంగా మారుతోంది. దరఖాస్తులకు కుల, ఆదాయ ధృవపత్రాల ను జాత చేయాల్సి ఉండటంతో చాలామంది మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మీసేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ధృవీకరణ పత్రాలకు నిబంధనల ప్రకారం రూ.45 తీసుకోవాలి. సరూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం పరిధిలో ఉన్న మీ సేవా కేంద్రాలు ఒక్కో ధృవపత్రానికి రూ.250లు నుంచి రూ.300 వసూలు చేస్తున్నా రు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అది స్థానిక రెవిన్యూ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ అధికారులు విచారణ చేసి ధృవ పత్రాలను జారీ చేస్తా రు.

ఈ ప్రక్రియలో చాలా చోట్ల రెవిన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ధరఖాస్తు గడువు తక్కువగా ఉండటంతో లబ్ధ్దిదారుల నుంచి మీసేవా కేంద్రాలు అందినకాడికి దండుకుంటున్నారు. ఆర్థిక సహాయం మంజూరువుతుందో లేదో తెలియదు కానీ ధృవపత్రాల కోసం రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు వ్యయం చేయాల్సి వస్తోందని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. సరూర్‌నగర్ రెవెన్యూ కార్యాలయంలో మొ త్తం ఆదాయ ధృవీకరణ పత్రాలు 7500 వచ్చాయిని, కు ల ధృవీకరణ పత్రాలు 3620 వచ్చాయని సమాచారం. అందులో ఆదాయ ధృవీకరణ పత్రాలు సుమారుగా 25 00 పూర్తయిని, 5000 పెండింగ్‌లో ఉన్నాయని, కుల ధృవీకరణ పత్రాలు 658 దరఖాస్తులు పూర్తయని, 29 46 పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News