Sunday, December 22, 2024

ఈ సారి ట్రోఫీ మాదే.. మిఛెల్ స్టార్క్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఈసారి తామే ట్రోఫీ సాధిస్తామనే నమ్మకాన్ని ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ జోస్యం చెప్పాడు. తమ సొంత గడ్డపై జరిగే ఈ ట్రోఫీలో ఎలాగైనా విజయం సాధించాలనే లక్షంతో ఉన్నామన్నాడు. గత రెండు సార్లు ట్రోఫీని తాము కోల్పోయామన్నాడు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేజార్చుకునే ప్రసక్తే లేదన్నాడు. ఈ సిరీస్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉందన్నాడు. అయితే తాము మాత్రం ఇప్పటి నుంచే సిరీస్‌పై దృష్టి పెట్టామన్నాడు. ప్రతి ఆటగాడు కూడా సిరీస్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడన్నాడు.

దీని కోసం సర్వం ఒడ్డేందుకు సిద్ధమయ్యారన్నాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయమన్నాడు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా తామే విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నాడు. అయితే భారత్‌తో పోటీ ఎప్పుడూ సవాల్ వంటిదేనని స్టార్క్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాను ఎదుర్కొవడం చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. భారత్‌తో జరిగే ప్రతి సిరీస్ ఉత్కంఠభరితంగానే కొనసాగుతుందన్నాడు. ఈసారి కూడా సిరీస్ నువ్వానేనా అన్నట్టు జరగడం ఖాయమని స్టార్క్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News