Monday, December 23, 2024

మాలల అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: మాలల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హామీ ఇచ్చారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హసన్‌పర్తి మండల మాల సంఘం ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమయంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మాల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి దళిత పథకం అమలులో మాల కులస్థులకు 50 శాతం వర్తించేయాలని విజ్ఞప్తి చేశారు.

మండల కేంద్రంలో మాల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 10 గుంటల స్థలాన్ని కేటాయించాలని కోరారు. 2014, 2018 ఎన్నికల్లోమీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. పై విషయాలపై సాను కూలంగా స్పందించిన ఎమ్మెల్యే దళిత బంధు అమలులో 50 శాతం మాల కులస్థులకు కేటాయించాలనే విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మాల సంఘం అభివృద్ధికి కృషి చేయడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్, ఐనవోలు వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మాల కులస్థుల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పోతరాజు ప్రభాకర్, కమిటీ సభ్యులు, మాల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News