Thursday, January 23, 2025

మున్నూరు కాపుల అభివృద్ధి కోసం కృషి చేస్తా : మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

జలవిహార్‌లో మున్నూరు కాపుల ప్లీనరీ సన్నాక సమావేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : మున్నూరు కాపుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం జలవిహార్‌లో మున్నూరు కాపుల ప్లీనరీ సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీల మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన పదిమంది మున్నూరు కాపు అభ్యర్థులను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపి రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేవంలో ఎంఎల్‌ఎలు వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్, నన్నపనేని నరేందర్, బాజిరెడ్డి గోవర్ధన్ వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు మెట్టు శ్రీనివాస్, వి ప్రకాష్, ఆకుల లలిత, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, ఉపాధ్యక్షులు చల్లా హరిశంకర్ కీలక సభ్యులు మానికొండ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, బిజెపి నేత విఠల్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Munnuru Kapus

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News