Sunday, January 19, 2025

మున్సిపల్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -
  •  చైర్మన్ కొందూటి నరేందర్

షాద్‌నగర్: మున్సిపల్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేయనున్నట్లు, అందుకు కౌన్సిలర్లు, ప్రజలు సహకరించాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ షాద్‌నగర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకొనున్నట్లు వివరించారు. ప్రతి కౌన్సిలర్ వార్డుల వారీగా అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో సిసి రోడ్లతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయా వార్డులో మిషన్ భగీరథ నీటి ట్యాంకుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

అభివృద్ధి సంక్షేమే లక్షంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నేతలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News