కొల్లాపూర్ : సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎన్మన్‌బెట్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం అనంతరం బుధవారం ఉదయం మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని గ్రామంలోని గడపగడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలోని అన్ని కాలనీలకు, ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ వారితో మమేకమై ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఏ ఏ సమస్యలతో ఇ బ్బంది పడుతున్నారో అని అడిగి తెలుసుకున్నారు. ఒక కుటుం బ సభ్యుడిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఉన్న డ్రైనేజ్, పరిసరాల పరిశుభ్రత, కరెంట్, నీరు, ఇళ్ల స్థలాల వంటి సమస్యలపై తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు ప్రజల సమస్యల విషయ ంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని,వెంటనే సమస్యల ప రిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా వస్తున్నాయా అంటూ అందరికి అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ ంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు పరామర్శిం చి ధైర్యం చెప్పారు. త్వరలోనే కొత్త లబ్ధిదారులకు వితంతు, వృ ద్ధాప్య ఫించన్లు, ఇండ్లు మంజూరవుతాయని తెలిపారు.
వీరమనాయిని చెరువుకు నీరు అందించేందుకు బాడుగదిన్నె నుంచి కోటి 50 లక్షల నిధులు మంజూరు చేసామని టెండర్ దశలో ఉందని, పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ఎ మ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.