Thursday, January 23, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవాబుపేట: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో ఆయన పర్యటించారు. ముందుగా శ్రీ పార్వతి పరమేశ్వరులను దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, తద్వారా గ్రామాలు వెనుకబడిపోయాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలకు ప్రతినెల నిధులు కేటాయిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాలే భవాని రవికాంత్, జడ్పిటిసి జయమ్మ, మార్కెట్, కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీడీవో సుమిత్రమ్మ, ఎంపీఓ విజయ్ కుమార్, సర్పంచులు వెంకట్ రెడ్డి, అనిత, రంగారెడ్డి, రత్నం, శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News