కంటోన్మెంట్: ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బిఅర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువా రం ఉదయం కంటోన్మెంట్ రెండవవార్డు పరిధిలోని రసూల్‌పురా స్థానిక బిఆర్‌ఎస్‌నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటన్న సమస్యలను ఆయన అడిగితెలుసుకున్నారు. రసూల్‌పురాలో నాలాలో ప్రవహిం చే మురికినీరు ఇళ్లల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్నామని కొన్ని చోట్ల తాగటానికి మంచినీరు పుష్కలంగా ఉంటే కొన్ని చోట్ల మంచినీటిని వృథా చేస్తున్నారని దీంతో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్తు లోడ్ సరిపోకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయనతో విన్నవించారు. దీంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కోరటంతో వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేసి వెంటనే ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం మర్రిరాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఅర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సంక్షేమ పథకాల అమలల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో బోయిన్‌పల్లి మా ర్కెట్ డైరెక్టర్ నయిం, బిఆర్‌ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, రాజాసింగ్, యూకుబ్, నగేష్, బిక్షప తి, మహేష్‌యాదవ్, జుబేద్, ఇషాద్, పాషా, కనకయ్య, శహద్, అలీ,శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.