Tuesday, December 24, 2024

విల్ యంగ్ హాఫ్ సెంచరీ…. కివీస్ 112/3

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు కివీస్ జట్టు 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విల్ యంగ్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి దూకుడుగా బౌలింగ్‌గా చేస్తున్నాడు. డేవన్ కాన్వే నాలుగు పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(05) పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యారు. ప్రస్తుతం క్రీజులో విల్ యంగ్(54), డారిల్ మెచెల్(11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News