Sunday, January 19, 2025

ఐసిసి కెప్టెన్లుగా బాబర్, విలియమ్సన్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే, టెస్టు కెప్టెన్లుగా బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)లు ఎంపికయ్యారు. ఇక వన్డే టీమ్ ఆఫ్‌ది ఇయర్ జట్టులో భారత్‌కు చెందిన ఒక్క క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. అయితే టెస్టు జట్టులో మాత్రం టీమిండియాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్‌లు ఐసిసి టెస్టులో స్థానం దక్కించుకున్నారు. మరోవైపు టెస్టు జట్టుకు విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వన్డే జట్టు సారథిగా బాబర్ ఆజమ్‌ను నియమించారు. మహిళల వన్డే జట్టులో మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలకు చోటు లభించింది. మహిళల టి20 జట్టులో స్మృతి మంధాన మాత్రమే స్థానం దక్కించుకుంది. పురుషుల విభాగంలో ఎవరికీ చోటు దక్కలేదు.

Williamson selected as ICC Test Captain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News