Wednesday, January 8, 2025

ఆదుకున్న విలియమ్సన్

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ 319/8, ఇంగ్లండ్‌తో తొలి టెస్టు
క్రైస్ట్‌చర్చ్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డెవోన్ కాన్వే రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్ టామ్ లాథమ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లాథమ్ 54 బంతుల్లో ఆరు ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి కేన్ పోరాటం కొనసాగించాడు. ఇటు కేన్ అటు రచిన్ సమన్వయంతో ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించారు. కానీ 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన రచిన్‌ను బషీర్ వెనక్కి పంపాడు. రచిన్ ఔటైనా విలియమ్సన్ కుదురుగా ఆడుతూ స్కోరును ముదుకు తీసుకెళ్లాడు. అయితే 197 బంతుల్లో పది ఫోర్లతో 93 పరుగులు చేసిన విలియమ్సన్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఔటై సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక ఆట ముగిసే సమయానికి గ్లెన్ ఫిలిప్స్ (41), టిమ్ సౌథి (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు, అట్కిన్సన్, కార్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News