Thursday, January 23, 2025

వింబుల్డన్ ఓపెన్: అల్కరాజ్, రిబకినా ముందంజ

- Advertisement -
- Advertisement -

లండన్ : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్, మూడో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్) తొలి రౌండ్‌లో విజయం సాధించింది. ఇతర పోటీల్లో 11వ సీడ్ డారియా కసట్కినా (రష్యా), 14వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్). 28వ సీడ్ ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం) తదితరులు విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇక మంగళవారం జరిగిన పోరులో రిబకినా 46, 61, 61 తేడాతో అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్‌ను ఓడించింది. తొలి సెట్‌లో రిబకినాకు చుక్కెదురైంది.

రోజర్స్ అద్భుత ఆటతో సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే తర్వాత పుంజుకున్న రిబకినా వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. తన మార్క్ షాట్లతో చెలరేగి పోయిన రిబకినా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఎలిసె మెర్టెన్స్ 76, 62 తేడాతో స్లోవేకియాకు చెదిన విక్టోరియాను ఓడించింది. కసట్కినా 61, 64 తేడాతో అమెరికా క్రీడాకారిణి కరోలైన్‌పై విజయం సాధించింది. బెన్సిక్ 75, 62తో స్వాన్ (బ్రిటన్)ను ఓడించి ముందంజ వేసింది. కాగా, ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అమెరికాకే చెందని సోఫియా కెనిన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాఫ్‌కు చుక్కెదురైంది.

అల్కరాజ్ ముందుకు..
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ బోణీ కొట్టాడు. ఫ్రాన్స్ ఆటగాడు జెరెమి చార్డీతో జరిగిన తొలి రౌండ్‌లో అల్కరాజ్ 60, 62, 75 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకున్న అల్కరాజ్‌కు మూడో సెట్‌లో కాస్త పోటీ ఎదురైంది. అయి తే టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచిన అల్కరాజ్ ముం దంజ వేశాడు. మరో పోటీలో 8వ సీడ్ జెన్నిక్ సిన్నర్ (ఇటలీ) విజయం సాధించాడు. జువాన్ (అర్జెంటీనా)తో జరిగిన తొలి రౌండ్‌లో సిన్నర్ 6౫2, 6౫2, 62తో జయకేతనం ఎగుర వేశాడు. నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 23వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్థాన్) తదితరులు కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News