Thursday, January 23, 2025

టెన్నిస్ సంగ్రామానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సోమవారం తెరలేవనుంది. ప్రపంచ టెన్నిస్‌లోనే అగ్రశ్రేణి టోర్నీగా పేరున్న వింబుల్డన్ టైటిల్ కోసం ఆటగాళ్లు సర్వం ఒడ్డి పోరాడుతారు. ఈసారి పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రఫెల్ నాదల్ (స్పెయిన్)ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరుమీదున్న నాదల్ వింబుల్డన్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక తనకు ఎంతో అచ్చివచ్చే వింబుల్డన్‌లో ఎలాగైనా టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్షంతో సెర్బియా యోధుడు నొవాక్ సిద్ధమయ్యాడు. ప్రపంచ టెన్నిస్‌లో వీరిద్దరి తిరుగులేని శక్తులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జకోవిచ్ ఈ రికార్డును ఎలాగైన తిరగరాయాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. వీరే కాకుండా గ్రీక్ సంచలనం స్టెఫానొస్ సిట్సిపాస్, స్పెయిన్ యువ కెరటం అల్కరాజ్, బెరెటెని, రూడ్ తదితరులు కూడా టైటిల్ సాధించాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యారు.
టైటిల్‌పై స్వియాటెక్ కన్ను
మరోవైపు మహిళల విభాగంలో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) టైటిల్‌పై కన్నేసింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించి జోరుమీదున్న ఇగా వింబుల్డన్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇప్పటికే వరుసగా 36 మ్యాచుల్లో గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈసారి స్వియాటెక్‌కే వింబుల్డన్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మహిళల టెన్నిస్‌లో స్వియాటెక్ అసాధారణ ఆటతో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక వింబుల్డన్ టైటిల్‌ను కూడా గెలిచి సత్తా చాటాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు రెండో సీడ్ అన్నెట్ కొంటావెట్, మూడో సీడ్ ఓన్స్ జాబియుర్, నాలుగో సీడ్ పౌలా బడోసా, ఐదో సీడ్ మారియా సక్కారి, ఐదో సీడ్ కరోలినా ప్లిసకోవా, బ్రిటన్ సంచలనం ఎమ్మా రడకాను, చెక్ సంచలనం బార్బొరా క్రెజ్సికొవా, ముగురుజా (స్పెయిన్) తదితరులు కూడా టైటిల్‌పై కన్నేశారు. ఇక అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ కూడా వింబుల్డన్ ఓపెన్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇలా పురుషులు, మహిళల విభాగంలో పలువురు టైటిల్ కోసం సర్వం ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. దీంతో వింబుల్డన్ ఓపెన్ హోరాహోరీగా సాగడం ఖాయం.

Wimbledon Open Grand Slam Starts from Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News