Sunday, January 19, 2025

జ్వరేవ్, సిన్నర్ ముందుకు

- Advertisement -
- Advertisement -

వింబుల్డన్ ఓపెన్
లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో జ్వరేవ్ 64, 64, 76 తేడాతో బ్రిటన్ ఆటగాడు కామెరూన్ నోరిను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు జ్వరేవ్ అటు నోరి ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో పోటీలో ఉత్కంఠ తప్పలేదు. అయితే నోరితో పోల్చితే జ్వరేవ్ కాస్త నిలకడైన ప్రదర్శన చేశాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగాడు. ఇద్దరు పట్టువీడకుండా పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. కాగా, కాస్త ఏకాగ్రతతో ఆడిన జ్వరేవ్ తొలి రెండు సెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

మూడో సెట్‌లో జ్వరేవ్‌కు ప్రత్యర్థి నుంచి మరింత తీవ్ర పోటీ ఎదురైంది. కానీ చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జ్వరేవ్ వరుసగా మూడో సెట్‌ను కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు టాప్ సీడ్ సిన్నర్ మూడో రౌండ్‌లో అలవోక విజయం సాధించాడు. సెర్బియాకు చెందిన మియోమిర్ కెక్‌మనొవిక్‌తో జరిగిన పోరులో సిన్నర్ 61, 64, 62తో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే సిన్నర్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తొమ్మిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మినార్‌కు వాకోవర్ లభించింది. దీంతో అతను ముందంజ వేశాడు.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో 13వ సీడ్ జలెనా ఒస్టాపెంకొ, ఎమ్మా రడుకాను (బ్రిటన్), 13వ సీడ్ బార్బొరా క్రెజ్సికొవా తదితరులు మూడో రౌండ్‌లో విజయం సాధించారు. ఒస్టాపెంకొ 61, 63తో అమెరికా క్రీడాకారిణి బెర్‌నర్దా పెరాను ఓడించింది. రడుకాను 62, 63తో 9వ సీడ్ మారియ సక్కారి (గ్రీస్)ను ఓడించింది. డొనా వెకిక్ (క్రొయేషియా) కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించింది. ఇక బార్బొరా క్రెజ్సికొవాకు ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించింది. దీంతో ఆమె కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News