Wednesday, January 22, 2025

క్వార్టర్ ఫైనల్లో పౌలిని, జకోవిచ్ ముందంజ

- Advertisement -
- Advertisement -

లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇటలీకి చెందిన ఏడో సీడ్ జాస్‌మైన్ పౌలిని క్వర్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన 12వ సీడ్ మాడిసన్ కీస్‌తో జరిగిన పోరులో పౌలినికి వాకోవర్ లభించింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇటు పౌలిని అటు కీస్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో పోరులో ఉత్కంఠ తప్పలేదు. తొలి సెట్‌లో పౌలిని ఆధిపత్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ కీస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన కీస్ తర్వాత ఒత్తిడికి గురైంది.

ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన పౌలిని సెట్‌ను దక్కించుకుంది. ఇక రెండో సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు కీస్ అటు పౌలిని ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. కానీ ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన కీస్ సెట్‌ను దక్కించుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా హోరాహోరీ తప్పలేదు. ఇద్దరు చెరో ఐదు గేమ్‌లు గెలిచి సమంగా నిలిచారు. ఈ సమయంలో కీస్ గాయానికి గురై మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఇటలీ సంచలనం పౌలినికి వాకోవర్ లభించింది. కీస్ మధ్యలోనే తప్పుకోవడంతో పౌలిని క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

జకోవిచ్ ముందుకు..

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. బ్రిటన్‌కు చెందిన అలెక్సి పొపిరిన్‌తో జరిగిన పోరులో జకోవిచ్ 46, 63, 64, 76తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌లో అలెక్సి దూకుడును ప్రదర్శించాడు. చివరి వరకు నిలకడైన ఆటతో సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాత జకోవిచ్ పుంజుకున్నాడు. ప్రత్యర్థిపై ఎదురుదాడి చేస్తూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో వరుసగా మూడు సెట్లను గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో 13వ సీడ్ ఫ్రిట్జ్ (అమెరికా) విజయం సాధించాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన టబిలోతో జరిగిన మూడో రౌండ్‌లో ఫ్రిట్జ్ 76, 63, 75తో జయభేరి మోగించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News