Monday, December 23, 2024

మూడో సారి ఎమ్మెల్యేగా గెలిపించండి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:భువనగిరి శాసనసభ్యు లు ఫైళ్ల శేఖర్ రెడ్డి పేరుకే శేఖర్ రెడ్డి అని పనులు చేయించుకోవడంలో బో లో శంకరుడు అని రాష్ట్ర మున్సిపల్, ఐ టీ శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిను శనివారం భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పట్టణంలో జరిగిన సభలో వేలాది మంది సమక్షంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పనితీరును కేటిఆర్ కొనియాడారు. కేటిఆర్ పర్యటనలో భా గంగా భూదాన్ పోచంపల్లి చేనేత ప్రజల చిరకాల కోరిక నేతన్న విగ్రాహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని, భారత్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ సందర్శన, వెజిటేబుల్ మార్కెట్ దోబీఘాట్, సీసీ రోడ్డు పనులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పోచంపల్లి హైండ్లూమ్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ఉ త్సవాలలో మంత్రి కేటిఆర్ తోపాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ర వీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.

ఈసందర్భంగా కేటీఆర్ నేతన్న సభలోముఖ్యఅతిథిలు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపించే ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డినీ ముచ్చటగా మూడోసారి అత్యధిక మె జార్టీతో గెలిపించుకుని సిఎం కెసిఆర్‌కి బహుమతిగా ఇవ్వాలని సూచించారు. మంత్రి కేటిఆర్ నోట ఈ ప్రసంగం ప్రస్తావన రాగానే అక్కడున్న కార్యకర్తల సంతోషాన్ని అవధుల్లేకుండా పోయింది. దీంతో ముచ్చటగా మూడోసారి సైతం మళ్ళీ పైళ్ల శేఖర్ రెడ్డి కే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని మరోసారి ఆయనే ఎమ్మెల్యే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News