Thursday, January 23, 2025

కార్మిక సంఘం ఎన్నికల్లో బిఆర్‌టీయూని గెలుపించండి

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బిపరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బిఆర్‌టీయూ అభ్యర్థి పెద్ది రెడ్డి ని గెలుపించమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆధివారం అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అథిథిగా హాజరై మాట్లాడారు. బిఎంఎస్,టిఎన్‌జియూసి ఐక్య కూటమి తరపున పోటీచేస్తున్న కార్మిక శాఖ మాజి మంత్రి పెద్ది రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపించాలన్నారు. కార్మిక వ్యతిరేకి సీఐటీయూ అని దానిని గెలుపిస్తే కార్మికులకు అన్యాయమే జరుగుతుందన్నారు.కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కూటమిగా ఏర్పటి పోటీ చేస్తున్నట్టుగా చెప్పారు.ప్రస్తుత అధికార యూనియన్ సిఐటీయూ యాజమాన్యంకు వత్తాసు పలుకుతూ కార్మికులకు అన్యాయం చేస్తుందని , కార్మికులకు చెందాల్సిన హక్కులను హరింప జేస్తుందని ఆరోపించారు.పరిశ్రమ మంచి లాభాల్లో నడుస్తున్నప్పటికి కార్మికులకు మాత్రం న్యాయం జరుగడం లేదన్నారు. తన యూనియన్ ను గెలుపించి ఆధికారంలోకి తీసుకొస్తే కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌టియూ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మణ్ విజయ్, కార్మిక నాయకులు మాధవరావు,శ్రీనివాస్,సుదర్శన్,బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News