Saturday, December 21, 2024

గాలి వాన బీభత్సం

- Advertisement -
- Advertisement -

గద్వాల: కేటిదొడ్డి మండల పరిధిలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులకు కేటిదొడ్డి గ్రామంలో చెట్టు కూలిపోయి ట్రాక్టర్‌పై పడటంతో ట్రాక్టర్ డ్యామేజ్ అయింది. అదేవిధంగా కొండాపురం గ్రామంలో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

మండల పరిధిలోని కేటిదొడ్డి, నందిన్నె, వెంకటాపురం, కొండాపురం, గంగన్‌పల్లి, తదితర గ్రామాల్లో కురిసిన వర్షాలకు భూమి పదును కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. అదే విధంగా ధరూర్ మండలం అల్వాల్‌పాడు, కోతులగిద్ద, మార్లబీడు తదితర గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News