Tuesday, November 5, 2024

తూప్రాన్‌లో గాలి వాన బీభత్సం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తూప్రాన్: సంగారెడ్డి జిల్లా తూప్రాన్ పరిధిలో మంగళవారం సాయంత్రం కురిసిన గాలివాన అరగంటలోనే నానా బీభత్సం సృష్టించింది. స్థానిక నర్సాపూర్ చౌరస్తా వద్దగల శివాజీ విగ్రహం గాలివానకు విరిగిపడింది. తూప్రాన్, ఇస్లాంపూర్, బ్రాహ్మణపల్లి, నాగులపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, నింపి ఉన్న బస్తాలన్నీ త డిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశుల దగ్గర వాన నీళ్లు నిల్వకుండారైతులు వర్షంలో తడుస్తూ ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా ఇబ్బందు లు పడ్డారు.

ఇమాంపూర్, రావెళ్లి, అల్లాపూర్ తదితర చొట్ల కొనుగోలు కేంద్రాల్లో గాలికి ధాన్యం కుప్పలపై కప్పి ఉంచిన సంచులు ఎగిరిపోయాయి. బ్రాహ్మణపల్లికి వెళ్లే రోడ్డుపై పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. అదేమార్గంలో 4 కరెంట్ స్థంభాలు నేలకొరిగాయి. పట్టణంలో మంగళవారం వారంతపు అంగడిలో వ్యాపారులు కట్టుకున్న తాత్కాలిక టెంట్లు గాలికి ఎగిరిపోయాయి. ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని అరగంట సేపు కురిసిన గాలివాన జనాన్ని ఆగమాగం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News