Friday, November 15, 2024

తెలంగాణలో 628 మెవాట్లకు పెరగున్న పవన విద్యుత్

- Advertisement -
- Advertisement -

ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఎస్‌ఈసిఐ

మన తెలంగాణ / హైదరాబాద్:  సంప్రదాయేతర వనరుల్లో భాగంగా ఇప్పటికే సోలార్ విద్యుత్ అందుబాటులోకి రాగా పవర్ విండ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో విండ్ పవర్ సామర్థం 128 మెగావాట్లు మాత్రమే ఉంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్‌ఈసిఐ) మొత్తం 1,300 మెగావాట్ల సామర్థ్యంతో తమిళనాడు, తెలంగాణ , మధ్యప్రదేశ్‌లలో ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ (ఐఎస్‌టిఎస్) అనుసంధానిత పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. మొత్తం 1300 మెగావాట్లతో సామర్ధంతో ఏర్పాటు చేయనున్న ఈ విండ్ పవర్‌లో 500 మెగావాట్ల తెలంగాణలోని నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ సబ్‌స్టేషన్‌లలో పంపిణీ చేయనుండగా మరో 300 మెగావాట్లు తమిళనాడులోని కరూర్ సబ్‌స్టేషన్‌కు, మద్యప్రదేశ్‌లో 500 మెగావాట్ల నీముచ్, మందసౌర్, పచోరో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ విండ్ పవర్ డవపర్లు (డబ్యూపిడి) ఎస్‌ఈసిఐ కింద పునరుత్పాదకశక్తిని సరఫరా చేసేందుకు ఐఎస్‌టిఎస్‌కు కనెక్ట్ చేసిన పవన విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు బిల్డ్ ,ఓన్ ఆపరేట్( బివోవో) ప్రేమ్ వర్క్ కింద పని చేస్తాయి. ఎస్‌ఈసిఐ మధ్యనే ట్రాంచ్ 15 విండ్ పవర్ ప్రాజెక్టుల కోసం రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ (ఆర్‌ఎఫ్‌ఎస్)ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బిడ్ గడువు తేదీని సెప్టెంబర్ 20గా ప్రకటించి దీన్ని ఈ నెల 25న తెరవనున్నారు.పవన విద్యుత్ కొనుగోలు కోసం ఆర్‌ఎఫ్‌ఎస్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఎస్‌ఈసిఐ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పిపిఏ) 25 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రస్తుతం పవన విద్యుత్ డిమాండ్ సామర్థం 128 మెగావాట్లు ఉండగా వీటిలో పరిగి విండ్ మిల్స్ నుంచి 100 మెగావాట్లు, జహరీబాద్‌లో సమీపంలోని హైదరాబాద్ , ముంబై జాతీయ రహదారి వెంట 28 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.ప్రణాళికా బద్దంగా ఇందుకు సంబంధించిన పనులు ముందుకు సాగితే తెలంగాణలో పవన విద్యుత్ సామర్ధం 628 మెగావాట్లుగా మారనుంది.

భారతదేశంలో పవన శక్తి యొక్క వాణిజ్యపరంగా విండ్ పవర్ సామర్థ్యం 200 గిగావాట్ ( జి డబ్లూ) కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. భారతదేశం ప్రస్తుతం 168.96 జిడబ్యూ(ఫిబ్రవరి 28, 2023 నాటికి) యొక్క మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది, దీని అమలు యొక్క వివిధ దశలలో సుమారు 82 జిడబ్లూ, టెండరింగ్ దశలో దాదాపు 41 జిడబ్యూ ఉండగా ఇందులో 64.38 జిడబ్లూ సోలార్ పవర్, 51.79 జిడబ్లూ హైడ్రో పవర్, 42.02 జిడబ్లూ విండ్ పవర్ మరియు 10.77 జిడబ్యూ బయో పవర్ ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News