Wednesday, January 8, 2025

విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు…రిలయన్స్, ఓఎన్ జిసికి ఊరట!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముడిచమురు ఎగుమతులపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్రం రద్దు చేసింది. దీంతో రిలయన్స్, ఓఎన్ జిసి కంపెనీలకు ఊరట లభించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటిఎఫ్), క్రూడ్ ఉత్పత్తుల ఎగుమతులపై 2022 జులై 1 నుంచి కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆయా కంపెనీలకు పెద్ద ఎత్తున లాభాలు వస్తుండడంపై విధించే పన్నును విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వం ఈ పన్ను రేటును సవరిస్తూ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News