బెంగళూరు: ఇక్కడి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్‌ఎఫ్) మహిళా అధికారి ఒకరిపై ఒక ప్రయాణికుడు చేయిచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా అధికారిని దుర్భాషలాడటమేకాక ఆమెకై చేయిచేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
డిసెంబర్ 25వ తేదీన ఈ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని జాకీ అమ్మానుర్ హషీమ్‌గా గుర్తించారు. అఅతను బెంగళూరు నుంచి కోచ్చికి వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. సిఐఎస్‌ఎఫ్ అధికారి ధనేశ్వరి కుట్టమ్ సెక్యూరిటీ చెక్స్ చేస్తుండగా మత్యం మత్తులో ఉన్న హషీమ్ తన గ్రీన్ కార్డు పోయిందని ఆమెకు చెప్పాడని పోలీసులు వివరించారు. దీంతో ఆ అధికారి సంబంధిత ఫారాలు ఇచ్చి వీటిని నింపి ఫిర్యాదు చేయాలని సూచించారని, అయితే నిందితుడు ఆమెను దుర్భాషలాడుతూ ఆమెపై చేయిచేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఆ మహిళా అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు యుసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.