సిండికేట్లుగా మారిన వ్యాపారులు
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు
మన తెలంగాణ/వాజేడు : మద్యం ప్రియుల అలవాట్లను అను వుగా తీసుకొ ని ఇష్టానుసారగా మద్యాన్ని అధిక ధరలకు విక్రయం జరుపుతున్నారు. వాజే డు, లక్ష్మిపురం లో నున్న మంద్యం షా పులో 30 నుండి 40 రూపాయల చొ ప్పున బీరు, విస్కి, బ్రాంది, ఎంసీ డావెల్సు, సీపు నిక్కర్, అధిక ధరలకు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. మద్యం షాపుల యజమానులు సిండికేట్లుగా మారి ఎక్సైజ్ శాఖ అధకారులను మచ్చిక చేసుకుని ఇష్టానుసారంగా అధిక ధరలకు మద్యం వియ్రయిస్తున్నారు. ఇదేంటని మద్యం ప్రియులు ప్రశ్న స్తే ఇష్టం ఉంటే కొనండి లేకపోతే వెళ్లండి అని ఘాటుగా సమాధానం చెబుతున్నారు. ప్రతి రోజూ తాగే మద్యం ప్రియులు పోతే 30 రూపాయలు పోయాయిలే అని మద్యం కొనుకొవడం తప్పడం లేదని బహిర్గతంగా అనుకుంటున్నారు. మద్యం షాపుల వద్ద ఏర్పాటు చెసిన ధరల పట్టికలో ఎంఆర్పీ ధరలు ఉంటే అందుకు విరుద్దంగా యధేచ్చగా సిండికేట్ల పేరుతో డబ్బులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధిక ధరలకు మద్యాన్ని విక్రియించకుండా ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.