Sunday, January 19, 2025

ఈ నెల 16న రాచకొండలో వైన్ షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బోనాల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 16వ తేదీన వైన్ షాపులు బంద్ చేయాలని సిపి డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బోనాల పండగ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.

16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్‌గిరి, కుషాయిగూడ డివిజన్లలో ఒక రోజు, ఎల్‌బి నగర్, మహేశ్వరం డివిజన్‌లో రెండు రోజులు(16,17తేదీల్లో) వైన్స్‌ను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News