Monday, December 23, 2024

నగరంలోని వైన్స్ షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

Wine shops closed for two days due to Sri Ramanavami

హైదరాబాద్: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వైన్స్ షాపులు మూసి వేస్తున మూడు పోలీస్ కమిషనర్లు శనివారం ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్స్, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయనున్నారు. ఈ మేరకు ముగ్గురు పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News