- Advertisement -
హైదరాబాద్: రోజూ మందు తాగితేనే గాని కిక్కు ఉండదని భావించే మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే, రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అయితే.. ఈ బంద్ కేవలం గ్రేటర్ హైదరాబాద్ లోనే. రేపు(ఏప్రిల్ 6వ తేదీ) శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
నగరంలోని వైన్సులు, బార్లతో పాటు కల్లు దుకాణాలు కూడా బంద్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -