Monday, January 27, 2025

డిసెంబర్ 31.. వైన్ షాపులు, బార్లపై కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి ఒంటిగంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు కొనసాగించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బి లైసెన్స్ కలిగిన బార్లలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు జరపవచ్చని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. కాగా త్రీస్టార్, ఆపై హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల ఎంట్రీ, ఎగ్జిట్లు వద్ద తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల శాఖ ఆదేశించింది. మరో రెండ్రోజుల్లో న్యూయర్ రాబోతున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News