Sunday, December 22, 2024

రేపు మద్యం దుకాణాలు బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధిస్తూ ముగ్గురు పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమ్మిగూడవద్దని ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమి కూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News