- Advertisement -
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వైన్స్‌ను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6గంటల వరకు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, వైన్స్ షాపులను మూసివేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిష్ట్రర్డ్ క్లబ్‌లకు దీని నుంచి మినహాయింపు ఉంది. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి షాపులను మూపివేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -