Monday, December 23, 2024

ఐఎఎఫ్ అధికారి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐఎఎఫ్ అధికారిపై కేసు నమోదు చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత సంవత్సరం సెప్టెంబర్ 23న 38 ఏళ్ల వింగ్ కమాండర్ ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెతో పలుమార్లు మాట్లాడాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని పెళ్లి చేసుకుంటానని సదరు యువతిని వింగ్ కమాండర్ నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. తనని తీసుకెళ్లి అతడి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు.

అతడి గతంలో వివాహం జరిగిన విషయాన్ని తన దగ్గర అతడు, కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. నవంబర్ 26న సోషల్ మీడియాలో ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలతో అతడు దిగిన ఫొటోలను గమనించి ఫొన్‌లో ఆమె నిలదీసింది. దీంతో వింగ్ కమాండర్, ఆమె తల్లిదండ్రులు యువతిని బ్లాక్‌మెయిల్ చేశారు. యువతి అతడు ఉంటున్న అంబాలాకు వెళ్లి నిలదీయడంతో ఆమెపై వింగ్‌కమాండ్ అత్యాచారం చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. యువతి మోసపోయానని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News