హైదరాబాద్: గత దీపావళి పండగ నుంచి త్వరలో వచ్చే దీపావళి వరకు బులియన్స్ కన్సాలిడేషన్ మోడ్‌లో ఉన్నాయని, యుఎస్ డాలర్, బాండ్ ఈల్డ్‌లలో అస్దిరత మధ్య మరికొంత అస్దిరత కనిపించిందని మోతీలాల్ ఓస్వాల్ పైనాన్షియల్ పేర్కొంది. రాబోయే 12 నెలల్లో బంగారు ధరలు రూ. 52నుంచి 53వేల వరకు పెరుగుతుందని చెబుతున్నారు. సంవత్సరం మొదటి ఆర్దభాగంలో ఆశించిన దానికంటే మెరుగైన ఆర్దిక డేటా, ఫెడ్ నుంచి హాకీష్ ఔట్‌లుక్ చాలామంది మార్కెట్ భాగస్వాములను అంచున ఉన్నాయని తెలిపింది. దీపావళి 2020లా కాకుండా ఈసంవత్సరం చాలా తక్కువ పరిమితులు ఉన్నాయి. దుకాణాలు తెరిచి కూడా తెరిచారని, ఈసంవత్సరం మొత్తం డిమాండ్ కూడ పెరిగిందని నిర్వహకులు తెలిపారు. గత కొన్ని నెలల్లో రిస్క్‌తో కూడిన ఆస్తులుభారీ స్థాయిలో వృద్ది చెందుతూ కనిపించాయని, అద్బుతమైన రాబడిని అందించినట్లు వెల్లడించారు. ట్రెండ్‌లో ఏదైనా మార్పు, బలహీనత, ముఖ్యంగా బంగారం విషయంలో ఏర్పడితే సురక్షిత భారీ పెరుగుదలకు దారి తీయవచ్చని అంచనా వేస్తున్నారు.
రాబోయే ఏడాదిలో పసిడి ధరలకు రెక్కలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -