Monday, December 23, 2024

క్రీడల్లో గెలుపోటములు సహజం

- Advertisement -
- Advertisement -

ధర్మారం: మండలంలోని పెరకపల్లి గ్రామంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో గెలిచిన జట్టుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం కప్‌తోపాటు నగదు బహుమతి అందజేశారు. తొలుత గ్రామానికి వచ్చిన మంత్రి ఈశ్వర్‌కు మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం గ్రామ శివారు నుండి ఊరేగింపుగా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గ్రామంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరగగా ముగింపు సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు కప్‌ను అందించారు. క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో 48 టీంలు పాల్గొనగా మొదటి బహుమతి కమ్మర్‌ఖాన్‌పేట యూత్ గెలుపొందగా రూ.20,116, ద్వితీయ బహుమతి పెరకపల్లి రూ.10,116ను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచ్ మొట్టె లక్ష్మి, మండల అధికారి ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News