Wednesday, December 25, 2024

చలికాలం.. మీ కారు భద్రంగానే ఉందా?

- Advertisement -
- Advertisement -

చలికాలం రాగానే రాగానే అనేక సమస్యలు మొదలవుతాయి. ఈ సమయంలో అందరూ తమ శరీరంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అదే విధంగా మీరు నడిపే వాహనాల మీద కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఈ క్రమంలో చలికాలంలో కారుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, త్వరగా స్టార్ట్ కాకపోవడం, మైలేజీ సరిగ్గా రాకపోవడం, ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే శీతాకాలంలో కారును ఎలా చూసుకోవాలో మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.

చలికాలంలో కార్ ఇంజిన్ ఆయిల్ మందంగా మారుతుంది. దీని కారణాంగానే కారు స్టార్ట్ అవ్వడం లో సమస్యలు వస్తాయి. ఇంజిన్ కూడా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలం వచ్చిన వెంటనే కార్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ను మార్చాలి.

అధిక చలి కారణంగా బ్యాటరీ లో పవర్ తగ్గుతుంది. దీని కారణంగానే కారు తొందరగా స్టార్ట్ అవ్వదు. ఇలాంటి సమయంలో బ్యాటరీ టెర్మినాల్స్ ను శుభ్రం చేసి వాటిపై గ్రీజు అప్లై చేయాలి. ఒకవేళ కార్ బ్యాటరీ పాతది అయితే దాని వెంటనే మార్చాలి.

వర్షాకాలంలో కార్ టైర్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో చలికాలంలో కూడా వాటిపై అంతే శ్రద్ధ వహించాలి. చలి, మంచు లో కార్ టైర్లు బలహీనంగా మారుతాయి. దీంతో కారు స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు టైర్లు గాలి ఒత్తిడిని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి.

కారు విండోస్ పై చలికాలంలో మంచు కురుస్తుంది. దీని కారణంగానే ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూడడంలో ఇబ్బంది పడుతాము. ఈ క్రమంలో విండోస్ వైపర్ వాష్ సరిగ్గా చేస్తున్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.

చలికాలం రాగానే వెంటనే కారు బ్రేక్ ప్యాడ్లు డిస్క్లను చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ అవసరమైతే వాటిని మార్చడం చాలా మంచిపని. దీంతోపాటు కారులో ఇన్స్టాల్ చేసిన అన్ని భాగాలు సరిగా పని చేస్తున్నాయో లేదో నిత్యం చెక్ చేస్తూ ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News