మనతెలంగాణ/హైదరాబాద్: మన దేశంలో ఈ సారి శీతాకాలంలో చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. మనదేశంలో సాధారణ వాతావరణ పరిస్థితుల్లో అయితే అక్టోబర్ నుంచే శీతాకాలం ప్రారంభమవుతుంది. డిసెంబర్ నాటికి చలి గజగజవణికిస్తుంది. దక్షిణాదితో పొలిస్తే ఉత్తర భారతంలోనూ , ఈశాన్య రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని , కనిష్ట ఉష్ణోగ్రతలు ఇదివరకటి స్థాయిలో పడిపోయే పరిస్థితులు లేవని ఐఎండి అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే 2024 ఫిబ్రవరి వరకూ దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో ప్రకటించారు. మంచు ప్రదేశాల మీదుగా వీచే పడమటి గాలుల తీవ్రత తగ్గటమే కాకుండా మరోవైపు లా నినా పరిస్థితి నెలకొనడం వల్లనే ఈ సారి చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని , ఈ చలికాలం వెచ్చగా ఉంటుందని డిజి మహాపాత్రో వివరించారు.
ఈ సారి చలి తక్కువే :ఐఎండి డిజి
- Advertisement -
- Advertisement -
- Advertisement -