Thursday, December 26, 2024

అదానీ లంచంపై రగడ తప్పదా?

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
అమెరికా కేసులపై చర్చకు విపక్షం డిమాండ్
మణిపూర్‌పైనా అఖిలపక్షంలో పట్టు వక్ఫ్
సవరణ సహా జాబితాలో 16 బిల్లులు

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం అభియోగాలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించవలసిన అంశాలను ఉభయ స భల కార్యకలాపాల సలహా కమిటీ (బిఎసి)లు నిర్ణయిస్తాయని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చే సింది. పార్లమెంట్ సమావేశాలు సాఫీగా జరిగే లా చూడాలని పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసిం ది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవా రం ప్రారంభం కానుండగా ఒక రోజు ముందు అధికార పక్ష నేతలు రాజకీయ పార్టీల సభా నా యకులతో భేటీ అయ్యారు. అఖిల పక్ష సమావే శం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులతో మాట్లాడు తూ, పార్లమెంట్ సెషన్ సాఫీగా సాగేలా చూడాలని అన్ని పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

అదానీ సమస్యపై చర్చను చేపట్టాలన్న ప్రతిపక్షం డిమాండ్‌పూ ప్రశ్నకు రిజిజు స మాధానం ఇస్తూ, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చై ర్‌పర్సన్ అనుమతితో పార్లమెంట్‌లో చర్చించవలసిన వ్యవహారాలపై ఉభయ సభల బిఎసిలు ని ర్ణయిస్తాయని తెలిపారు. అదానీ గ్రూప్‌పై వచ్చి న లంచం అభియోగాల అంశం, మణిపూర్‌లో పరిస్థితి గురించి అఖిల పక్ష భేటీలో కాంగ్రెస్ స భ్యులు ప్రస్తావించారు. అదానీ అంశంపైన, మ ణిపూర్‌లో జాతుల విద్వేష వివాదంపైన తమ పార్టీ చర్చను కోరుతోందని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ చెప్పారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయగా, ప్రభుత్వానికి మణిపూర్‌లో జా తుల మధ్య హింసాకాండ ప్రజ్వరిల్లుతున్నప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇంకా విశ్వాసం ఉందని గొగోయ్ ఆక్షేపించారు. ఉత్తరాదిన పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాల అంశాలపై కూడా ప్రతిపక్షం చర్చను కోరింది. సోమవారం పార్లమెంట్ సమావేశమైనప్పుడు ముందుగా అదానీ సమస్యను చేపట్టాలని తమ పార్టీ కోరుతున్నదని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ చెప్పారు.

తమ సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం సానుకూల ఒప్పందం సాధించేందుకు ఆ కంపెనీ రూ. 2300 కోట్లకు పైగా రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చినందున అది దేశ ఆర్థిక, భద్రత ప్రయోజనాలతో ముడిపడిన తీవ్ర సమస్య అని రాజ్యసభ ఎంపి ప్రమోద్ తివారీ అన్నారు. సౌర విద్యుత్ కాంట్రాక్టులకు సంబంధించి సానుకూల షరతులకు బదులుగా భారతీయ అధికారులకు కోటీశ్వరుడు గౌతమ్ అదానీ 265 మిలియన్ యుఎస్ డాలర్లు (దాదాపు రూ. 2200 కోట్లు) మేరకు లంచం చెల్లించేందుకు ఒక పథకంలో భాగం అని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆయనపై అభియోగాలు మోపారు. అయితే. అదానీ గ్రూప్ ఆ అభియోగాలను ఖండించింది. ఉత్తరాదిన తీవ్ర వాయు కాలుష్యం, ‘అదుపు తప్పిన’ మణిపూర్ పరిస్థితి, రైలు ప్రమాదాలు వంటి సమస్యలపై కూడా కాంగ్రెస్ చర్చను కోరుతోందని తివారీ తెలియజేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, గౌరవ్ గొగోయ్‌తో పాటు టి శివ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, అనుప్రియ పటేల్ సమావేశానికి హాజరయ్యారు.

సోమవారం మొదలు కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు సాగనున్నాయి. ఈ సమావేశాల్లో పరిశీలన నిమిత్తం వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు కూడా ఉన్నది. ఉభయ సభల సంయుక్త కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించిన అనంతరం పరిశీలించి, ఆమోద ముద్ర కోసం నిర్ణయించిన జాబితాలో ఆ బిల్లు ఉంది. సంయుక్త కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల తొలి వారం చివరి రోజు సమర్పించవలసి ఉన్నది. అయితే, నివేదిక సమర్పణకు గడువు పొడిగించాలని కమిటీలోని ప్రతిపక్ష సభ్యులు కోరుతున్నారు. కమిటీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి జగదంబికా పాల్ కమిటీ సమావేశాల్లో తమ మాట వినిపించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా జోక్యం చేసుకోవాలని వారు కోరారు. సంయుక్త కమిటీ గడువు పొడిగింపునకు ఒక నిబంధన ఉన్నదని, అయితే ప్రస్తుతానికి చర్చలు ఏవీ లేవని రిజిజు చెప్పారు. కమిటీ గడువు పొడిగించే అంశాన్ని చర్చించే వేదిక లోక్‌సభ బిఎసి అని ఆయన నొక్కిచెప్పారు.

కాగా, 202425 సంవత్సరాలనికి అనుబంధ పద్దుల మొదటి బ్యాచ్ ప్రతిపాదన, చర్చ, వోటింగ్‌ను సభా కార్యక్రమాల జాబితాలో చేర్చడమైంది. ప్రవేశపెట్టడానికి, పరిశీలించడానికి, ఆమోదించడానికి ప్రభుత్వం పేర్కొన్న ఇతర బిల్లుల్లో ఢిల్లీ జిల్లా కోర్టుల ద్రవ్యసంబంధిత అప్పిలేట్ పరిధిని ప్రస్తుత రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడానికి పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లుకూడా ఉన్నది. వాటిలో మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, భారతీయ రేవుల బిల్లు కూడా ఉన్నాయి. కాగా, లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు సహా ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ బులెటిన్ ప్రకారం, రెండు బిల్లులు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఆమోదించిన భారతీయ వాయుయాన్ విధేయక్ పేరిట అదనపు బిల్లు కూడా ఎగువ సభలో పెండింగ్‌లో ఉన్నదని రాజ్యసభ బులెటిన్ తెలిపింది. దేశంలో జమిలి ఎన్నికల విధానం అమలుకు ప్రతిపాదించిన బిల్లులు ఇంకా జాబితాలో లేవు. అయితే. ప్రభుత్వం ఆ ప్రతిపాదిత బిల్లును రానున్న సెషన్‌లో ప్రవేశపెట్టవచ్చునని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News