శీతాకాలం పగటి కాలం చాలా తక్కువ, రాత్రిసమయం ఎక్కువ ఉంటాయని అంటుంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట సుదీర్ఘమైన రాత్రి కాలం సంభవిస్తుంది. ఆరోజు ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం ఉండే వింతను మనం చూడబోతున్నాం. పగటివేళ కేవలం 8 గంటలే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం ( వింటర్ సొలెస్టైస్ )అని అంటారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా డిసెంబర్ 21న ఈఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధ గోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్ఠంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది.
ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతియేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 2023 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి మధ్య గరిష్ఠ దూరం ఉండటం వల్ల సూర్య కిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం (వింటర్ సోల్స్టస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతోపాటు ఇతర తూర్పు ఆసియా దేశాల్లో , బౌద్ధమతం లోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత,శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఉత్తర భారతంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పుష్యమాస పండగను జరుపుకుంటారు.